17, సెప్టెంబర్ 2025, బుధవారం

Kishkinda puri movie review !!!

 


బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుమప పరమేశ్వరన్ నటించిన సినిమా కిష్కింధ పురి సినిమా థియేటర్ లలో విడుదల అయింది వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ సినిమా మరి ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ,హీరోయిన్ ghost walking tour అనే కంపెనీ లో పనిచేస్తుంటారు అంటే దెయ్యాలు ఉండే భవనాలకు అవి అంటే ఆసక్తి ఉండే వారికి వాటిని చూపించి వాటి గురించి కథలు చెపుతూ ఉంటారు అదే వలే పని అయితే కొంతమందిని సువర్ణ మాయ అనే పురాతన పాడుబడ్డ రేడియో స్టేషన్ కి తీసుకెళ్తారు అయితే అక్కడి నుండి వచ్చిన 3 వ్యక్తులు చనిపోతారు 

అయితే మిగిలిన వారిని హీరో ఎలా కాపాడాడు ఇంతకు ఈ హత్యలు ఏ దెయ్యం చేస్తుంది దాని వెనకున్న కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

పరవాలేదు ఒకసారి చూడ వచ్చు కథ కొత్తగానే ఉంది హార్రర్ కూడా పండింది విలనిజం కూడా బాగుంది బెల్లంకొండ అన్న అకౌంట్లోకి ఒక హిట్ పడినట్టే !!!


15, సెప్టెంబర్ 2025, సోమవారం

Mirai movie review in telugu !!!

 

హనుమాన్ సినిమా హిట్ తరువాత వచ్చిన mirai సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అనగనగా అశోకుడు అనే రాజు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో తంత్ర విద్యల్ని సంపాదించి చివరకు దానిని 9 మహా గ్రంథాలలో బంధిస్తాడు అయితే 9 మహా గ్రంథాలు ఒక విలన్ సంపాదించాలని అనుకుంటాడు అయితే దానికి మన హీరో ఆ 9 మహా గ్రంథాలను  విలన్ చేజిక్కించుకుండా  హీరో ఎలా నిలువరించాడు 

అసలు హీరో కథ ఏమిటి అన్నది మిగిలిన కథ ఇందులో హీరో తల్లిగా శ్రియ నటించింది ఆ విలన్ చాలా బలవంతుడు హీరో సామాన్య మనిషి అసలు ఈ mirai అంటే ఏమిటి 

దానికి ఈ కథ కు ఏమిటి సంబంధం ఇదే ఈ కథ నాకు ఈ సినిమా కథ కొంచెం ఎక్కడో చూసినట్టు ఉంది కొన్ని కొరియన్, జపనీస్ సినిమా లో కలిపి చూసి నట్టుంది దానికి మన తెలుగు సెంటిమెంట్ కథ చెప్పినట్టుంది 

సో మొత్తానికి ఒక సారి చూడ వచ్చు !!!

10, సెప్టెంబర్ 2025, బుధవారం

Su from so Movie review in telugu !!!


 Su from so సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా ott లోకి విడుదల అయింది జియో hotstar లో streeming అవుతుంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అందరికీ పెద్ద రవి అన్న అని పిలుచుకునే ఒక ఆయన ఉంటాడు ఒక పెళ్లి ఫంక్షన్ జరుగుతుంది అందులో అందరూ మందు తాగి ఎంజాయ్ చేస్తుంటారు 

అందులో ఒక వ్యక్తి తెగేసి ఒక వ్యక్తి ఇంటిలో ఉన్న బాత్రూమ్ లోకి తొంగి చూస్తాడు అయితే అతడిని పట్టుకుంటే అప్పటినుండి దెయ్యం  పట్టినట్టు నటిస్తాడు ఆ దెయ్యాన్ని వదిలించటానికి ఎంత ప్రయత్నించిన వదలదు అన్నట్టు నటిస్తాడు 

అక్కడికి ఒక స్వామీజీ వస్తాడు మొదట దెయ్యని వదిలించినట్టు అనుకుంటారు కానీ ఎవరు నమ్మరు అయితే చివరకు ఈ కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ కామెడీ గా బాగానే ఉంది  సినిమా క్లెయిమ్స్ అంతగా నాకు బాగా అని పించలేదు కామెడీ పరంగా ఒకసారి చూడవచ్చు  !!!

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

Little heart movie review !!!

 Mouli సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే అబ్బాయి మొదటిసారి హీరోగా చేసిన సినిమా little heart movie తెలుగులో థియేటర్ లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా థియేటర్లలో ఎందుకు విడుదల చేశారో నాకు అర్థం కాలేదు OTT లో విడుదల చేయాల్సిన సినిమా ఇక పోతే అసలు కథ హీరో ఒక చిన్న కుటుంబం అమ్మ, నాన్న,తమ్ముడు, హీరో వాళ్ళ నాన్న ది గవర్నమెంట్ జాబ్ అయితే తన కొడుకుని బాగా చదివించి మంచి ఇంజనీర్ గా చూడాలని ఆశ అయితే కొడుకు జులాయిగా ఆకతాయిగా తిరుగుతుంటాడు అయితే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు తను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది ఉన్న చదువు కాస్త ఆటకు ఎక్కుతుంది 

ఇంకా తన తండ్రి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొమంటాడు అయితే అక్కడ అమ్మాయిని మన హీరో లవ్ చేస్తాడు అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఆ అమ్మాయి మనోడి కంటే 3 సంవత్సరాలు పెద్దది అయితే మన హీరో తరువాత స్టెప్ ఏమిటి అన్నది మిగిలిన కథ 

సో సో గా ఉంది కదా దీనికన్నా 90s memories web series ఉంది కదా అదే బాగుంటుంది కాకపోతే ఇందులో కొంచెం కామెడీ ట్రాక్ కలిపారు అంతే 

సో యావరేజ్ బొమ్మ అంతే !!!

7, సెప్టెంబర్ 2025, ఆదివారం

Netflix లో విడుదల అయిన inspector zende సినిమా పై నా అభిప్రాయం !!!!

 

ఈ సినిమా Netflix లో విడుదల అయింది ఇన్స్పెక్టర్ zinde సినిమా ఈ సినిమా కామెడీ కింద చూపించటం జరిగింది కానీ ఇది నిజంగా జరిగిన కథ అని ఈ సినిమా మొదట్లో చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక దొంగ జైలులో మత్తు మందు కలిపి అక్కడినుండి. తప్పించుకుని పారిపోతాడు అయితే అతడిని పట్టుకోవటానికి ఇన్స్పెక్టర్ zinde బయలు దేరుతాడు అయితే అతడిని పట్టుకుంది మొదలు కూడా ఇన్స్పెక్టర్ zinde అయితే చివరికి అతడిని మన హీరో పట్టుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ 

ఈ సినిమా కామెడీ ట్రై చేశారు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు అనిపించింది అంతగా ఏమి బాగాలేదు ఫ్యామిలీ man web series లో నటించిన మనోజ్ వాజపేయి ఇందులో ప్రధాన హీరో పాత్రలో నటించటం జరిగింది అసలు కథలో కామెడీ అంతగా పండ లేదు జస్ట్ సో సో గా మాత్రమే ఉంది !!!

6, సెప్టెంబర్ 2025, శనివారం

శివ కార్తికేయన్ నటించిన మదరాసి సినిమా పై నా అభిప్రాయం !!!


 A.R మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా శివ కార్తికేయన్ నటించిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

తమిళ నాడు లోని ప్రజలకు గన్ అలవాటు చేయటానికి అక్కడికి ఒక సిండికేట్ గ్యాంగ్ లో ఇద్దరు విరాట్, చిరాగ్ తమిళ నాడులోకి ప్రవేశిస్తారు అయితే వారిని ఎదుర్కోడానికి NIA ప్రయత్నిస్తుంది వాళ్లను అడ్డుకుంటారు విరాట్, చిరాగ్ అయితే అప్పుడే మన హీరో లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు 

అప్పుడే ఒక NIA ఆఫీసర్ నీ హాస్పిటల్ లో కలుస్తారు హీరో తన ఆపరేషన్ కి ఎలాగో చనిపోవాలనుకుంటున్న హీరోని వాడు కోవాలనే అనుకుంటాడు అయితే హీరో కొంచెం మానసిక సమస్య తో బాధ పడుతుంటాడు ఇంతకీ హీరో ఎందుకు చని పోవాలనుకుంటాడు హీరో గతం ఏమిటో

NIA ఆఫీసర్ చేసిన ఆపరేషన్ లో హీరో భాగం ఏమిటి అన్నది మిగిలిన కథ నాకెందుకో మురుగదాస్ మార్క్ సినిమాగా అనిపించలేదు సినిమా ఏదో ఏదో లాగా ఉంది సినిమా 

Expect చేసిన అంచనాలు అయితే దాటలేదు సినిమాలో దాదాపు 3 గంటలు ఉంది సినిమా అంతగా ఏమి లేదు అనిపించింది సినిమా లో !!!

మేటి మాట !!!